PLD: కార్తీక మాసం సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం సమీక్షలో, భక్తులకు సౌకర్యాలు, భద్రత కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.