GDWL: కేటీ దొడ్డి మండలం పాగుంట గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్మిస్తున్న అలివేలు మంగమ్మ కొత్త ఆలయానికి భారీ విరాళం గురువారం అందించాలని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన సుజాత ఆలయ నిర్మాణానికి రూ. 4లక్షలు విరాళం సమర్పించారు. దాతలకు ఆలయ పెద్దలు, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.