BDK: సుజాతనగర్ మండలంలోని మంజిత్ కాటన్ మిల్లులో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ సీతారాములు, సొసైటీ ఛైర్మన్ మండే వీరహనుమంతరావు లతో కలిసి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలన్నారు.