ATP: పామిడి మండలం తంబళ్లపల్లి గ్రామ సమీపంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం గురువారం పోలీసులు సీజ్ చేశారు. సీఐ యుగేందర్ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచారని సమాచారం రావడంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించమన్నారు. అందులో భాగంగా 103 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.