భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచకప్ కీలక మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వర్షం కారణంగా మొదట మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించగా, భారత్ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, తిరిగి వర్షం రావడంతో మ్యాచ్ను 44 ఓవర్లకు కుదించారు. దీంతో DLS ప్రకారం, న్యూజిలాండ్ టార్గెట్ను 325 పరుగులుగా నిర్ణయించారు.