AKP: ఏకోపాద్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ అనకాపల్లి మండల శాఖ అధ్యక్షులు మామిడి బాబురావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వారు సెలవులు పెట్టడానికి అవకాశం లేకపోతుందన్నారు. దీంతో ఏడాదిలో నాలుగు సెలవులకు మించి వినియోగించుకోలేకపోతున్నామని తెలిపారు.