PPM: పార్వతీపురం మండలంలోని సంధివలస, బొడ్డవలస గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల గృహాలను సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి గురువారం సందర్శించారు. ఆయా గ్రామాల్లోని దరఖాస్తుదారులతో ఆమె ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఉండే రెవిన్యూ సమస్యలను తెలుసుకొని, వాటిని వీలైనంత వరకు పరిష్కరిస్తామని తెలిపారు.