JN: పట్టణాల్లో చిన్న ప్లాట్లలో ఇందిరమ్మ ఇళ్లను జీ+1 పద్ధతిలో కట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గురువారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఇప్పటివరకు 5793 ఇళ్లు మంజూరై, 4950 గ్రౌండింగ్ అయ్యాయని, రూ.77.28 కోట్లు లబ్ధిదారులకు చెల్లించామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.