NRPT: మక్తల్ పట్టణంలో డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు పాలమూరు యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, పరీక్షల కంట్రోలర్‌కు వినతిపత్రం అందజేశారు. మక్తల్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నప్పటికీ, పరీక్షా కేంద్రం నారాయణపేటలో ఉండటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఏబీవీపీ నాయకులు తెలిపారు.