CTR:పు త్తూరు హైస్కూల్లో గురువారం జరిగిన అండర్-19 టైక్వాండో పోటీల్లో పలు విభాగాలలో కేజీబీవీ బైరెడ్డిపల్లి పాఠశాలకు చెందిన రోహిని, లహరి, కుసుమ, హర్షిత AP మోడల్ స్కూల్ కమ్మనపల్లి చెందిన చందన రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ మేరకు వారిని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అనిత, పీఈటీ తాజ్ అభినందించారు. విజేతలు 26న కడపలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నారు.