KMM: గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వైజ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె ఇంకా కొనసాగుతుంది. మధిరలోని ఎస్టీ బాలికలు, బాలురు హాస్టల్ వర్కర్లు గురువారం మధిర ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ముందు 42వ రోజు నిరవధిక సమ్మె కొనసాగించారు. డైలీ వేజ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.