WGL: నర్సంపేట RDO కార్యాలయం ముందు ఇవాళ ఏఐఎస్టీయూ (న్యూ) ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ.. సిమెంట్ డీలర్లు స్థానిక కార్మికులను తొలగించి బీహార్ కార్మికులతో పనులు చేయించే ఆలోచనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.