BPT: అద్దంకి నియోజకవర్గం లోని ఆయా మండలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులతో గురువారం అమరావతిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశం అయ్యారు. రైతులకు యూరియా అందుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రతి రైతుకు యూరియా అందాలని, యూరియా ఎక్కడ దారి మల్లకూడదని మంత్రి సూచించారు. ఏ సమస్య ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.