NRML: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి నిర్వాహకులు సిద్ధంగా ఉండాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.