BHPL: భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలోని గంగాధరేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం గజ స్తంభానికి ఆలయ అర్చకులు ఆకాశదీపం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఆకాశదీపం పెట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.