SRCL: జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఇంఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.