MBNR: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. గురువారం భూత్పూర్ మండలం తాటికొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి విస్మరించిన గత పాలకులు అక్రమాలతో కాలయాపన చేశారని విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.