MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని దేవస్థానం లో గురువారం సాయంత్రం ఆకాశదీపం మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకొని ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రదోషకాల పూజ అనంతరం ఆకాశ దీపాన్ని ఆవిష్కరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు.