కృష్ణా: భారీ వర్షాల కారణంగా గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు కంట్రోల్ రూమ్‌ను గురువారం ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌లో ఆరుగురు పంచాయతీ కార్యదర్శులను నియమించినట్లు మండల పరిషత్ అధికారి ఎం.డీ.ఇమ్రాన్ తెలిపారు. వీరు 24 గంటలూ డ్యూటీలో ఉండి, మండల పరిధిలో వర్షాలు, వరదలు, రహదారులు, గ్రామాల పరిస్థితులను పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు.