KRNL: తారక రామారావు నగర్లో డ్రైనేజీ లేక చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు పుల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో మురికినీరు, వర్షపు నీరు చేరి దోమల పుట్టుక పెరిగి మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి చెత్త సమస్యను పరిష్కరించాలని కోరారు.