SRD: సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజక వర్గంలోని రోడ్ల మరమ్మత్తులపై మంత్రి దామోదర్ రాజనర్సింహా గురువారం పంచాయత్ రాజ్, R&B శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సంగారెడ్డిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల పనులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.