KMM: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ డిమాండ్ చేశారు. గురువారం రఘునాథపాలెం మండలంలో వర్షాలకు దెబ్బతిన పత్తి పంటలను పరిశీలించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన పత్తి రైతులకు నష్టపరిహారం అందించాలని, సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.