TG: హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, హైదర్ నగర్, కొంపల్లి, బాలానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, అమీర్ పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై వర్షపు నీరు చేరడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.