ASR: గూడెం కొత్తవీధి మండలంలోని రింతాడ, సంకాడ, పెదవలస, దేవరపల్లి, లకవరపుపేట, ధామనపల్లి పంచాయతీల్లో గ్రామాలకు 24న శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వేణుగోపాల్ తెలిపారు. 11 కేవీ పెదవలస ఫీడర్ లైన్‌పై మరమ్మతు పనులు చేపడుతున్నందున ఈ నిలిపివేత ఉంటుందని పేర్కొన్నారు.