BPT: పిట్టలవానిపాలెం మండలం చందోలులోని శ్రీ భగలాముఖి అమ్మవారిని పెనుగొండ వాసవీ పీఠాధిపతి బాల స్వామీజీ సందర్శించుకున్నారు. గురువారం ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం బండ్లమ్మ తల్లిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవి నవరాత్రుల దీక్ష అనంతరం అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.