ADB: జైనద్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఏటా కార్తీక మాసంలో నిర్వహించే జడ కొప్పు కోలాట ప్రదర్శన కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రదర్శనను వీక్షించారు. అంతరించిపోతున్న గ్రామీణ కళలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నిర్వాహకులు నరిగె మోహన్, హెడావ్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూరం అరుణ్, లాండే సాయి, గోపతి సాయిరాం ఉన్నారు.