AP: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు సజీవదహనం కావడం తీవ్రంగా కలచివేసిందని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విచారం వ్యక్తం చేశారు.