SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు నువ్వలరేవు, మంచి నీళ్ళపేట బ్రిడ్జి , అప్రోచ్ రోడ్డు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ప్రతి వీధిలో రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలు కల్పనకు పనిచేయాలని కోరారు. అప్రోచ్ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.