కృష్ణా: గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డిజే సౌండ్ సిస్టమ్ యజమానులతో సీఐ కొండపల్లి శ్రీనివాస్ నిన్న సమావేశం నిర్వహించారు. పండుగల సందర్భంగా పాటించాల్సిన DO’s, DON’Ts గురించి సూచనలు చేశారు. డిజే యజమానులు చట్టపరమైన నిబంధనలు, శబ్ద పరిమితులు, ప్రజా శాంతి భద్రతను కాపాడే విధంగా వ్యవహరించాలని సూచించారు.