కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఈ ఘటన విచారకరమని, క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ‘X’లో పోస్ట్ పెట్టారు. కాగా, ఇవాళ తెల్లవారు జామున 3గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.