కడప రెండో పట్టణ ఠాణా పరిధిలోని ఐదుగురిపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కడప వక్కల పేటకు చెందిన రేవతి, బాలాజీ నగరుకు చెందిన లోకేష్‌తో మూడేళ్ల కిందట వివాహం అయింది. తరచూ గొడవ పడేవారు. రేవతిపై భర్త, అత్తమామలు పలువురు వేదించేవారు. ఈ మేరకు రేవతి భర్త సహా ఐదుగురుపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.