పాక్-అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొనడంతో ఈనెల 11 నుంచి ఇరుదేశాల సరిహద్దులు మూసివేశారు. దీంతో ఇరుదేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషదాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటాయి. ఘర్షణలకు ముందుతో పోలిస్తే పాక్లో టమాట ధరలు ఐదు రెట్లు పెరిగి కిలో టమాట ధర 600 పాకిస్తానీ రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.