GNTR: గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. గేమ్స్ ఫెడరేషన్ ముద్రించిన ఆహ్వాన పత్రికలో ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరుకు బదులు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేరును వేశారు. ఈ పొరపాటుపై ఎమ్మెల్సీ ఆలపాటి శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.