AP: కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో 20మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అందులో 19మంది మృతదేహాలను ఫోరెన్సిక్ బృందాలు బస్సులో నుంచి వెలికితీశాయి. బైకర్ శివశంకర్ కూడా మృతి చెందినట్లు తెలిపారు. HYD నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఏడుగురని డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు.