SRD: కంగ్టి మండలం దెగులవాడి గ్రామంలో కపాస్ కిసాన్ యాప్ పట్ల వ్యవసాయ విస్తరణ అధికారి స్వాతి పోస్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. స్థానిక పత్తి రైతులకు సమావేశపరిచి కపాస్ కిసాన్ యాప్ ముఖ్య ఉద్దేశంపై వివరించారు. ప్రభుత్వ మద్దతు ధరతో పత్తిని మార్కెట్లో అమ్మాలంటే తొలత ఈ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.