KMM: భార్యను భర్త గొడ్డలితో నరికి చంపిన సంఘటన శుక్రవారం ఏన్కూర్ మండల పరిధిలోని కాలనీ నాచారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాటి రామారావు, గోవర్ధన ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా భార్య గోవర్ధన(32) ప్రవర్తనలో మార్పు రావడంతో భర్త ఎన్నిసార్లు చెప్పినప్పటికీ భార్యలో మార్పు రాకపోవడంతో, విసుకు చెంది గొడ్డలితో నరికి చంపినట్లు తెలిసింది.