పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ‘ఫౌజీ’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో కన్నడ నటి చైత్ర జె. ఆచార్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ తదితరులు నటిస్తుండగా.. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.