AP: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. ప్రమాద తీవ్రత చూసి మాటలు రావడం లేదని అన్నారు. మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా, ఈ బస్సు ప్రమాదంలో 20 మందికిపైగా చనిపోయినట్లు తెలుస్తోంది.