BHPL: జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం 1862 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. చివరి రోజైన అక్టోబర్ 23న 183 దరఖాస్తులు రాగా, ములుగు జిల్లాలో మల్లంపల్లి షాపుకు 77, చల్వాయికి 2, గోవిందరావుపేటకు 3 దరఖాస్తులు వచ్చాయి. షాపుల కేటాయింపు కోసం అక్టోబర్ 27న డ్రా తీస్తామని ఆయన పేర్కొన్నారు.