NGKL: కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామ శ్రీవారి చెరువులో శుక్రవారం మొసలి కలకలం రేపింది. గ్రామంలోని జాలరుల వలకు మొసలి చిక్కింది. దీంతో వారు దాన్ని తాళ్లతో బంధించి మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. అధికారులు జాలరులను అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామ ప్రజలు చెరువులోకి వెళ్లరాదని సూచించారు.