ADB: భీంపూర్ మండలంలోని గుబిడి గ్రామానికి ఎట్టకేలకు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. 7, 8 నెలలుగా బస్సులు రాక ఇబ్బందులు పడ్డామని గ్రామస్థులు పేర్కొన్నారు. శుక్రవారం గ్రామానికి బస్సు రావడంతో దానిని అందంగా అలంకరించి, డ్రైవర్, కండక్టర్ను సన్మానించారు. ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.