HYD: నిమ్స్ ఆస్పత్రిలో 10 గంటల్లో మూడు కిడ్నీల మార్పిడి చికిత్సలు విజయవంతంగా పూర్తి చేసినట్లు యూరాలజీ విభాగం వైద్యులు తెలిపారు. ఇందులో ఒకటి లైవ్ డోనర్ నుంచి సేకరించగా.. మరో రెండు కిడ్నీలను బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 141 కిడ్నీల మార్పిడి చేసినట్లు తెలిపారు.