GNTR: ప్రజలకు సైబర్ నేరాలు, మోసాల పట్ల అవగాహన కల్పించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రామ/ వార్డు మహిళా పోలీసులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీసులు తమ పరిధిలోని ప్రజలతో మమేకమై సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. అనంతరం సైబర్ భద్రతా పోస్టర్లు, అవగాహన బ్రోచర్లను ఆయన విడుదల చేశారు.