KRNL: కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలిని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, SP విక్రాంత్ పాటిల్, JC నూరుల్ కమర్ పరిశీలించారు. బైక్ బస్సు కిందకి దూసుకెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఆ సమయంలో 41 మంది బస్సులో ఉన్నారని, వారిలో 21 మంది ప్రాణాలతో బయటపడ్డారని కలెక్టర్ చెప్పారు.