ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం 116దుకాణాలకుగాను ఆఖరి రోజు వరకు 4,435 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.133 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27న డ్రా పద్ధతిలో లైసెన్సు దారులను ఎంపిక చేయనున్నారు.