VZM: భోగాపురంకు చెందిన ఎనిమిదిమంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర ప్రవేశించడంతో నేవీ అధికారుల చేతిలో బందిలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామమోహన్ నాయుడు బాధితులను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేశారు.