హన్మకొండ జిల్లా పరిధిలోని వయోవృద్ధులు, శిశు గృహంలో ఒప్పంద ప్రాతిపదికన నర్స్, చౌకీదార్ ఉద్యోగాల కోసం మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి జె. జయంతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 25-50 ఏళ్లలోపు ఆసక్తి, అర్హత కలిగిన మహిళలు అక్టోబర్ 24 నుంచి 30 వరకు కలెక్టరేట్లోని జీ1, జీ2 బ్లాక్‌లలో సంప్రదించాలని సూచించారు.