KMM: పెనుబల్లి మండలం యడ్లబంజరులో నాటు కోళ్లు చోరీకి గురయ్యాయి. గ్రామానికి చెందిన సోదరులైన యడ్ల సుబ్బారావు, మాణిక్యారావు పెంచుతున్న నాలుగు పందెం పుంజులు, 25 నాటుకోళ్లన గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నమోదయ్యాయి. చోరీకి గురైన నాటుకోళ్ల విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని చెప్పారు.