E.G: జగ్గంపేట వైసీపీ కార్యాలయం నందు జగ్గంపేట వైసీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి తోట. నరసిహం ప్రజా ఉద్యమం పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ ఈనెల 28న ప్రజా పేరిట నిరసన చేపడుతున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.