MDK: రామాయంపేట పట్టణానికి చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సొసైటీ ఛైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి 56వ సారి రక్తదానం చేశారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. దీంతో జిల్లా ఎస్పీ D.V శ్రీనివాసరావు చేతుల మీదుగా రక్తదాన పత్రాన్ని అందుకున్నారు.